- Advertisement -
ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నను అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. 2021 సంవత్సరానికి గాను కవిత్వ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ‘వల్లంకి తాళం’ కవిత రచనకు గాను అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారం కింద ఆయన ప్రశంసాపత్రంతో పాటు లక్ష రూపాయల నగదు ఇస్తారు.
ఆయనతో పాటు తగుళ్ల గోపాల్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం, దేవరాజు మహారాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు దక్కనుంది.
- Advertisement -