మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమా బ్యాంకాక్‌లో జరిగిన భారీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో 70 మంది నటీనటులు పాల్గొనగా 30 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. అద్భుతమైన బ్యాంకాక్ లోకేషన్స్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – మొదటి షెడ్యూల్ చిత్రీకరణ అనుకున్న ప్లానింగ్‌లో చక్కగా పూర్తయ్యింది. దర్శకుడు సంపత్ నంది, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తెరకెక్కించిన విజువల్స్ చాలా గ్రాండియర్‌గా వచ్చాయి. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్ సీన్స్, బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో చిత్రీకరించిన భారీ కార్ చేజింగ్ సీన్ అద్భుతంగా వచ్చాయి. అలాగే రిచ్‌నెస్ కోసం సినిమాను బ్యాంకాక్‌లోని ప్రముఖ బార్స్, పబ్స్‌లో చిత్రీకరించాం. ఫ్యామిలీ సన్నివేశాలు, క్యాథరిన్ ఇంట్రడక్షన్ సన్నివేశం, విలన్‌కు సంబంధించిన సన్నివేశాలను, తనికెళ్ళ భరణి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరికొత్త లుక్‌లో కనపడతారు. ఎంజాయ్ చేసేలా ప్రతి సన్నివేశాన్ని రిచ్ లుక్‌తో రూపొందిస్తున్నాం అన్నారు.