రిలయన్స్‌ జియోలో గూగుల్‌ భారీ పెట్టబడులు!

200
google jio
- Advertisement -

భారత టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జియోలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌లో 75 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన గూగుల్‌ ఇందులో భాగంగా జియోలో 4 బిలియన్ డాలర్లు(30 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.

రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తామని సుందర్ పిచాయ్ ప్రకటించడంతో జియోలో పెట్టుబడులపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక ఇప్పటికే జియోలో ఫేస్ బుక్, ఇంటెల్‌, సిల్వర్‌ లేక్‌, విస్తా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌, ముబదలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, టీపీజీ, ఎల్‌ కాటర్టన్‌, పీఐఎఫ్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

- Advertisement -