భారత్‌లో గూగుల్ 75 వేల కోట్లు పెట్టుబడులు..!

109
google india

భారత్‌లో రూ. 75 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది గూగుల్. విదేశాల్లో కంపెనీని విస్తరించడంలో భాగంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఇండియాలో 75 వేల కోట్ల (సుమారుగా 10 బిలియన్ డాలర్లు)ను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఇండియన్ డిజిటల్ ఎకానమీని పెంపొందించడంతోపాటు దేశాన్ని డిజిటలైజేషన్‌లో ముందుకు తీసుకెళ్లడానికి ఇది దోహదపడుతుందని గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇండియా డిజిటల్ ఎకానమీపై తనకు పూర్తి నమ్మకం ఉందని…డిజిటల్ ఇండియా కోసం కలలు కంటున్న ప్రధాని నరేంద్రమోడీకి సహకరించడాన్ని మేం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు పిచాయ్.

ఈ మిషన్ పూర్తిగా తన వ్యక్తిగతానికి సంబంధించినది. పెరుగుతున్న టెక్నాలజీ ఓ కుటుంబంగా మమ్మల్ని మరింత దగ్గర చేసిందన్నారు. తమకు సహకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్ ప్రసాద్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఇవాళ ఉదయం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో సుదీర్ఘంగా చర్చించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మోడీ…ఔత్సాహిక వ్యాపారవేత్తలు, యువత, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింప చేయడంపైనా ఆసక్తికర చర్చ జరిగిందని తెలిపారు.డేటా భద్రత, ఇంటర్నెట్ రక్షణ అంశాల ప్రాధాన్యత గురించి మాట్లాడామన్నారు.