కరోనా….శ్రీశైలం మల్లన్న దర్శనానికి బ్రేక్…

48
srisailam

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటంతో శ్రీశైలం ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడు రోజుల పాటు దైవ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు ప్రకటించారు.

కరోనా వైరస్ కారణంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అని తెలిపారు.ప్రస్తుతం శ్రీశైల క్షేత్రంలో ఉన్న భక్తులకు గంట పాటు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.

దేవస్థాన వసతి గదులతో పాటు నిత్యాన్నదాన సత్రాలలో ఉండే భక్తులను తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా ఈవో విజ్ఞప్తి చేశారు .ఇతర రాష్ట్రాల నుండి శ్రీశైల క్షేత్రానికి దర్శనార్థం వచ్చే భక్తులు కొద్ది రోజుల పాటు రావొద్దని ప్రకటించారు. ఇప్పటికే శ్రీశైలం మండలంలో 32 పాజిటివ్ కేసులు రాగా దేవస్థానంలో చేసే ఇద్దరు పర్చారకులకు, ఉద్యోగులకు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు బారీగా చేసుకుంటోంది.జూరాల పవర్ హౌస్ ద్వారా 13 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ కి చేరగా ప్రస్తుతం నీటి మట్టం : 815.10.అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు.ప్రస్తుతం నీటి నిల్వ : 37.45 టి.ఎం.సి లు ,పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు.