బాలీవుడ్‌పై సుస్మితా హాట్ కామెంట్స్..!

38
susmitha

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఇటీవలే ఆర్య అనే వెబ్ సిరీస్ తో మళ్లీ నటనా రంగం వైపు అడుగులేసింది.ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది సుస్మితా.

బాలీవుడ్‌లో తాను కొన్ని సినిమాలు రిజక్ట్ చేయడానికి కారణం ఉందని…అది ఇండస్ట్రీలోని కొంతమంది ఇగో హార్ట్ చేసిందని వెల్లడించారు. సినిమా రంగం అంటేనే ఇగోలతో కూడిన వ్యాపారమని…ఇది రహాస్యం కాదన్నారు. మీరు నో చెప్పిన ప్రతిసారీ అది ఒక సమస్యగా చివరికి మీరే ఓ సమస్య అవుతారని…చివరకు సినిమాలో పనిచేయడం ఇష్టం లేదనుకుంటారని తెలిపారు.

తాను ఎప్పుడూ నేను చేసే పని గురించి నిజాయితీగా మరియు బాధ్యతగా ఉండేందుకే ఇష్టపడతానని తెలిపారు సుస్మితా. 1994లో మిస్ యూనివ‌ర్స్ టైటిల్‌ను గెలుచుకున్న సుస్మితా.. రెండు సంవత్స‌రాల త‌ర్వాత ద‌స్త‌క్ సినిమాతో సినీరంగ ప్ర‌వేశం చేశారు.