విదేశాల నుండి తెలంగాణకు వచ్చేవారికి గుడ్‌న్యూస్..

85
covid

విదేశాల నుండి తెలంగాణకు వచ్చే వారికి గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. పెయిడ్ క్వారంటైన్ నుండి మినహాయింపు ఇచ్చింది. దీంతో ఇకపై నేరుగా వారు ఇళ్లకు వెళ్లిపోవచ్చు. దీంతో పాటు దేశీయ ప్రయాణాల నిబంధనలను సైతం సడలించింది.

ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏడు రోజులపాటు హోటల్‌ లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉండేవారు. ఇకపై ఆ అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిబంధనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

అయితే విదేశాల నుంచి వచ్చేవారు ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకుని రావాలని వెల్లడించింది. హైదరాబాద్‌ చేరుకున్నాకా విమానాశ్రయంలోనూ పరీక్ష చేయించుకోవాలని….. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వైద్యాధికారుల సలహా మేరకు ఇంట్లో ఉండాలి లేదా ఆసుపత్రిలో చేరాలని తెలిపింది.