విమాన ప్రయాణీకులకు అధికారుల సూచనలు..

251
aai
- Advertisement -

దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించడానికి విమానాశ్రయాలకు ప్రామాణిక నిబంధనలను జారీ చేసింది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. విమానయాన ప్రయాణికులకు, ఎయిర్ పోర్ట్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించింది.

ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని…మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది.ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రవేశ మార్గాల ద్వారా తనిఖీ చేస్తారని వెల్లడించింది.

14 ఏళ్లలోపు పిల్లలకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. విమానాశ్రయం టెర్మినల్ భవనంలోకి ప్రవేశించే ముందు ప్రయాణీకులు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ జోన్ గుండా నడవాలన్నారు. ఇందుకు విమానాశ్రయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

టెర్మినల్ భవనంలోకి ప్రవేశించే ముందు విమానాశ్రయ నిర్వాహకులు ప్రయాణీకుల లగేజీ శానిటైజేషన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు సామాజిక దూరం పాటించే విధంగా మార్కింగ్ చేయాలన్నారు. ఎయిర్ పోర్టులలో ఎక్కడ కూడా ప్రయాణికులు గుమికూడకుండా చూడాలన్నారు.ఎయిర్ పోర్ట్ లలో విరివిగా శానీటైజర్స్ అందుబాటులో ఉంచాలని…పూర్తి టెర్మినల్ ను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలన్నారు. ఫుడ్ & బేవరేజెస్ దుకాణాలు కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూ తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చింది.

- Advertisement -