బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు..

1016
basanth nagar airport
- Advertisement -

ప్రయాణికుల సౌకర్యార్థం 6 చోట్ల కొత్తగా విమానాశ్రయాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేయడానికి సంసిద్దత వ్యక్తం చేసింది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ).

ఇందుకోసం త్వరలో సాంకేతిక బృందాలతో ఏరోనాటికల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఉడాన్ పథకంలో భాగంగా బసంత్ నగర్‌ ఎయిర్‌స్ట్రిప్ స్ధలంలో విమానాశ్రయం ఏర్పాటుకోసం పదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 21న ఏఏఐ అధికారులు ఎయిర్‌స్టిప్‌ను పరిశీలించగా త్వరలో సర్వే నిర్వహించనున్నారు.

ఎయిర్‌స్ట్రిప్ స్ధలం,ప్రతిపాదిత భూముల సమగ్ర పరిశీలన,జీఐఎస్ మ్యాపింగ్ వంటి సమాచారాన్ని సేకరించడంతో పాటు నేల స్వభావం,రన్‌వే,ఏటీసీకి అనుకూలతలు వంటి అంశాలను అంచనా వేయనున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే తొలుత 80 సీట్ల సామర్ధ్యం గల ఏటీఆర్ ఎయిర్‌క్రాప్టు విమానాలను నడపనున్నారు.

ఇక్కడు ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేయడం ద్వారా పర్యాటకంగా కలిసివస్తుందని భావిస్తున్నారు. గోదావరి నదిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు,మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు ఉన్నాయి. దీనికి తోడు కాళేశ్వరం నిర్మాణాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుండటంతో పాటు రామగుండం ఎన్టీపీసీ,సింగరేణి బొగ్గు గనులు,థర్మల్ విద్యుత్ కేంద్రాలు,కేశోరాం సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ ఎయిర్ పోర్టు రానుందనే వార్తతో స్ధానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -