ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త…

210
kcr
- Advertisement -

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. ఆర్టిజన్లను క్రమబద్దీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు. ప్రభుత్వం మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

23 వేల మంది ఆర్టిజన్లకు ఇవాళ పండుగ రోజన్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంచి జీవన ప్రమాణాలతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశహన్నారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ నిర్ణయించాలని,పీఆర్సీ అమలు చేయాలని విద్యుత్ శాఖ సీఎండీని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్.

అంతకముందు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రమాదం అంచుల్లో ప్రతి రోజు విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులు క్రమబద్ధీకరించకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తెచ్చారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ మానవీయ దృక్పథాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

- Advertisement -