యూ టర్న్‌పై ఎంపీ కవిత ప్రశంసలు..

201
U Turn
- Advertisement -

నివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై సమంత ప్రధానపాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూ టర్న్‌. మెసేజ్ బేస్డ్ థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబడుతోంది. విమర్శకుల ప్రశంసలను పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

U Turn

యూ టర్న్‌ చిత్రయూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు. తాను ఇంకా సినిమా చూడలేదని తన ఇద్దరు పిల్లల ద్వార రివ్యూ తెలుసుకున్నాని చెప్పారు. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడంలో సక్సెస్ అయ్యారని తెలిపింది. థ్రిల్లర్ మూవీతో సోషల్ మెసేజ్‌ని ప్రజల్లోకి చేరవేయడం గొప్ప అంశం అంటూ ప్రశంసలు గుప్పించింది. సినిమాలో నటించిన నటీనటులపై ప్రశంసలు గుప్పించింది. రంగస్థలం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా ఈ సినిమలో జర్నలిస్టుగా సమంత గొప్పగా నటించిందన్నారు.

Image result for u turn movie

క‌న్న‌డ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం స‌మంత‌తో పాటు భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల అయిన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు లభించడంతో పాటు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

- Advertisement -