డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నందమూరి నట సింహం బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఖమ్మంలో ఘనంగా జరగనుంది. ఇప్పటికే పైసా వసూల్ స్టంపర్తో బాలయ్య పవర్ చూపించిన పూరి తాజాగా మరిన్ని వైరైటీ ప్రచారాలు చేయబోతున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ అభిమానులకు స్కాలర్షిప్స్ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు, కన్వీనర్లతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, భవ్యక్రియేషన్స్ అధినేత వీ ఆనంద్ ప్రసాద్ నిర్వహించిన ఫ్యాన్స్‌మీట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
బాలకృష్ణతో సినిమా చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, మరో సినిమా కూడా చేయాలని ఉందని, తన కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ‘పైసా వసూల్’ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని పూరీ పేర్కొన్నారు. కాగా, ఈ సంద్భరంగా 101 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని తాము నిర్ణయించామని ఆనంద్ ప్రసాద్ పేర్కొన్నారు. బాలయ్య అభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్ల సాయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అనుకుంటున్నామని చెప్పారు.