4 నెలల్లో 10 వేలు తగ్గిన బంగారం!

114
gold

కరోనా లాక్ డౌన్ కాలంలో బంగారం ధరలు చుక్కలనంటిన సంగతి తెలిసిందే ఏకంగా ఆల్ టైం హైక్‌కి బంగారం ధరలు పెరిగిపోగా క్రమక్రమంగా పరిస్ధితులు చక్కబడుతుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఆగస్టు 7న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.59,130కు చేరగా ప్రస్తుతం బంగారం ధర రూ.49,260కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆగస్టు 7న రూ.54,200గా ఉండగా ప్రస్తుతం రూ.45,150గా ఉంది. ఆగస్టు 7న కేజీ వెండి ధర ఏకంగా రూ.76,510గా ఉండగా కేజీ వెండి ధర కేజీకి రూ.67,700కు పతనమైంది.