స్థిరంగా బంగారం, వెండి ధరలు..

193
gold
- Advertisement -

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.52,980గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉంటే సిల్వర్ రేట్ మాత్రం పెరిగింది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.600 పెరిగి రూ.68,100కు చేరింది. నెల రోజుల్లో వెండి రేటు ఏకంగా రూ.8 వేలు పెరిగింది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1740 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది రూ.81.71 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -