గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

38
chiru
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గాఢ్‌ఫాదర్. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా రానుండగా ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబ‌ర్ 5న సినిమా విడుదల కానుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి థియేట్రిక‌ల్ బిజినెస్ గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని నమ్మకంతో ఉన్న మేకర్స్ భారీ ధరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారట. దాదాపు రూ. 90 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జరుగుతుందని అంచనా వేశారు. ఈ లెక్క ప్రకారం గాఢ్ ఫాదర్‌ బ్రేక్ ఈవెన్ కోసం రూ.95 కోట్ల వ‌ర‌కు సాధించాల్సి ఉంటుంది.

నేటి నుండి ప్ర‌మోష‌న్స్ షూరు చేయ‌నుండగా రిలీజ్‌కు ముందు రోజు వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ చేస్తార‌ట‌. ఈ చిత్రం మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా తెర‌కెక్కింది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

- Advertisement -