మరో రెండు రోజులు భారీ వర్షాలు..

156
rains telangana
- Advertisement -

తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో వానలు బీభత్సం సృష్టించాయి. వాన బిభత్సానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే అల్పపీడనం ప్రభావం, నైరుతి రుతుపవనాలతో గత పదేళ్లలో వానాకాలంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. గోదావరి

తీరంలో హై అలర్ట్‌ ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మేడారం జంపన్న వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవహరిస్తోంది. దీంతో మేడారం, పస్రా దారిలో రాకపోకలు నిలిచిపోయాయి.భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం,భద్రాచలం వద్ద ప్రమాదస్దాయిలో ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హెల్ప్‌లైన్ సెంటర్‌ ఏర్పాటుచేసింది ప్రభుత్వం.

- Advertisement -