మేక పాలు తాగితే ఎన్ని ప్రయోజనాలో!

7
- Advertisement -

సాధారణంగా ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కాల్షియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ డి, ఇ, కె.. ఇలా మన శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా లభిస్తాయి. అంతే కాకుండా ప్రతిరోజూ పాలు తాగడం వల్ల కండరాలు బలపడతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. కాబట్టి అన్నివిధాలుగా ప్రతిరోజూ పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే చాలామంది గేదె పాలు లేదా ఆవు పాలు మాత్రమే ఎక్కువగా తాగుతుంటారు.

ఎందుకంటే మార్కెట్ లో ఇవి రెండు మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. అయితే వీటి కంటే మేకపాలు తాగడం మరి మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. గేదె, ఆవు పాలతో పోల్చితే మేక పాలలో పోషకాలు రెట్టింపు స్థాయిలో లభిస్తాయట. మందంగా ఉండే మేకపాలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న పిల్లలకు మేకపాలను తాగించడం వల్ల వేగంగా బలం పొందుకునే అవకాశం ఉంటుందట.

మేక పాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుందట. కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనతతో బాధపడేవారు మేకపాలను ఆహార డైట్ లో చేర్చుకుంటే ఆ సమస్యలన్నీ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా మేకపాలలోని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయట. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు మేకపాలు మరింత ప్రయోజనకరం. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజూ మేకపాలు తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు మేకపాలను తాగించడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:వేసవిలో చెరుకురసం తాగుతున్నారా?

- Advertisement -