‘అగ్లీ స్టోరీ’..ఊహల్లోని ప్రేమ నిజజీవితంలో ఉండదు

27
- Advertisement -

లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లు వస్తున్న సినిమా అగ్లీ స్టోరీ. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ : లక్కీ మీడియా రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న అగ్లీ స్టోరీ మూవీ తో 2024 హిట్టు కొట్టబోతున్నాము. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్ గారు, సుభాషిని గారు, కొండా లక్ష్మణ్ గారు నన్ను నా కథను నమ్మి ఈ సినిమాని నిర్మించారు. వారు నాకు ఇచ్చిన సహకారంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే డైలాగ్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి డైలాగులు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఇంకా ఎన్నో ఉండబోతున్నాయి. ఈ గ్లింప్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో ముందు ముందు వచ్చే టీజర్ ట్రైలర్ మరియు సినిమాని ఇంకా చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్నాము. అతి త్వరలో టీజర్, ట్రైలర్ తో మిమ్మల్ని కలుస్తాము. ఫస్ట్ లుక్ నుంచి మమ్మల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారు ఈ గ్లింప్స్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారు అలాగే మమ్మల్ని ఆదరించి సినిమాని ఇంకా మంచి బిగ్గెస్ట్ హిట్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు.

Also Read:సీఎం రేవంత్‌తో మెగాస్టార్ భేటీ

- Advertisement -