జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో ఉగ్రవాదులు టూరిస్ట్‌లే టార్గెట్‌గా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుమారు 28 మంది ప్రాణాలు కొల్పోగా బాధిత కుటుంబాలకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున సాయం ప్రకటించింది.
దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా సంస్థలు అడుగడుగు జల్లెడ పడుతుండగా వారిని పట్టుకునేందుకు ముష్కరుల ఊహా చిత్రాలను ఏజెన్సీలు రిలీజ్ చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశాయి.
Also Read:కల్కి 2 .. నాగ్ అశ్విన్ హింట్!
కశ్మీర్ లోయను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సందర్శించారు. ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

