లాస్ట్ పెగ్గు ఆ కిక్కే వేరు.. మందు కోసం కొట్టుకున్న అమ్మాయిలు

313
Women In Drunk And Drive
- Advertisement -

పవన్ కళ్యాణ్‌ సినిమాలో లాంచ్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు అనే డైలాగ్ ఉంది. కానీ ఇక్కడ లాస్ట్ పెగ్గు కోసం ఇద్దరు యువతులు రోడ్డు పై కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వికెండ్ సందర్భంగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ కి వెళ్లారు ఇద్దరు యువతులు. ఇద్దరూ కలిసి పబ్ లో పుల్ గా మందు కొట్టారు. మద్యం మత్తులో వారిద్దరి మధ్యలో గొడవ జరగడంతో నడి రోడ్డుపై కొట్టుకున్నారు. పొట్టిపొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు, రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడికి దిగారు.

వీళ్ల గొడవు చూసేందుకు… చుట్టూ జనం చేరిపోయారు. అర్థ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కేబీఆర్ పార్క్ వద్ద ఈఘటన చోటుచేసుకుంది. అమ్మాయిలు ఇద్దరూ గొడవ పడుతుండటంతో వారిని అదుపుచేసేందుకు మహిళా పోలీసులు ఆ సమయంలో అందుబాటులో లేక పోవడంతో … ట్రాఫిక్ పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు.

చివరికి మహిళా కానిస్టేబుల్స్‌ను పిలిపించి… గొడవకు దిగిన అమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తం గొడవకు కారణం… మద్యం తాగడమేనని తేల్చారు పోలీసులు. ఒక అమ్మాయి చివరి పెగ్‌ను మరో అమ్మాయి తాగేయడంతోనే వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -