ట్రేడర్లు మార్చి 31వ తేదీలోపు తమ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ సూచించారు. లైసెన్సుల రెన్యువల్‌లో జాప్యం చేస్తే భారీగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1 నుండి మే 30 వరకు లైసెన్సులు రెన్యువల్ చేసుకుంటే 25శాతం ఫెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా మరింత జాప్యంచేసి మే 31 నుండి రెన్యువల్ చేసుకునే ట్రేడర్లు 50శాతం ఫెనాల్టీ చెల్లించాలని తెలిపారు. ప్రొవిజినల్ ట్రేడ్ లైసెన్స్ కలిగినవారు ఆన్‌లైన్‌లో ఏదైనా ఇ-సేవా సెంటర్స్, సిటీజన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపి, మార్చి 31లోపు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.
కొత్త ట్రేడ్ లైసెన్స్‌లకై ఇ-సేవా కేంద్రాలు, జిహెచ్ఎంసి సిటీజన్ సర్వీస్ సెంటర్లు, జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్, జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్‌లలో దరఖాస్తు చేయాలని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే ట్రేడర్లపై భారీ అపరాదరుసుం విధించనున్నట్లు హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్ వివరాలకై జిహెచ్ఎంసి వెబ్‌సైట్ www.ghmc.gov.in ను పరిశీలించాలని తెలిపారు.