గ్లామర్ ట్రాక్ లోకి ఆ హోమ్లీ సింగర్

43
- Advertisement -

సింగర్ గీతా మాధురికి యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. హోమ్లీ లుక్ లో కనిపించే ఆమె అందానికి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, గాయనిగా గీతా మాధురి అందుకోవాల్సిన హైప్స్ ను అందుకోలేదు అంటుంటారు. ఇదే విషయాన్ని గీతా మాధురి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అందుకే, గీతా మాధురి ఈవెంట్స్ కి, షోలకు కూడా ఎక్కువగా అటెండ్ అవుతూ, నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య గీతా మాధురి అమెరికా టూర్ కి వెళ్లి వచ్చిందట. అమెరికాలో ఉన్న పలు తెలుగు సంఘాలు ఆమెని అమెరికాకి పిలిచాయి.

తమ సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు అతిథిగా గీతా మాధురిని ఆహ్వానించాయి. ఐతే, ఆమె అక్కడ గ్లామరస్ డ్రెస్ లు వేసుకుని కిక్ ఇచ్చే బోల్డ్ సాంగ్స్ ను పాడింది అని టాక్ నడుస్తోంది. తాను అందాల ఆరబోతకు దూరంగా ఉంటాను అని గీతా మాధురి చాలాసార్లు చెప్పింది. కానీ, గత కొన్ని నెలలుగా గమనిస్తే.. గీతా మాధురి కొంచెం గ్లామర్ షో డోస్ ను పెంచింది. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే.. గ్లామర్ ప్రపంచంలో నిలబడాలి అంటే.. ఆ మాత్రం డోస్ ఉండాలి అంటూ తన ఎక్స్ పోజింగ్ పై ఆమె పాజిటివ్ కామెంట్స్ కూడా చేస్తోందట.

Also Read:అదే జరిగితే..మోడీ ఇరుకున పడినట్లే!

మొత్తమ్మీద 34కి చేరువలో ఉన్న ఈ భామ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో కూడా ఉందట. ఈ మధ్య ఫిట్ నెస్ మీద గీతా మాధురి ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే గ్లామర్ షో డోస్ కూడా పెంచింది. నటిగా కూడా బిజీ బిజీ కావాలి అనేది గీతా మాధురి కోరిక. పైగా ఆమె ఇప్పటికే రెండు పెద్ద సినిమాలు కూడా సైన్ చేసినట్లు టాక్. ఆ సినిమాల కోసమే గీతా మాధురి స్లిమ్ అయ్యే పనిలో పడింది. మరి గీతా మాధురి సినీ కెరీర్ ఎటువైపు వెళ్తుందో చూడాలి.

Also Read:మోడీ సర్కార్‌పై అవిశ్వాసం..అనుమతిచ్చిన స్పీకర్

- Advertisement -