“గౌతమ్ నంద” లో ఇది హైలెట్..

272
- Advertisement -

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై  జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఆఖరి పాట అయిన “బోలే రామ్ బోలే రామ్” పాట చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. కథానాయకుడు గోపీచంద్,  కథానాయిక హన్సిక నడుమ సాగే యుగళ గీతమైన ఈ పాటను “బెస్ట్ రోమాంటిక్ సింగిల్”గా నిలిచిపోయే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు దర్శకులు సంపత్ నంది.

 GAUTHAM NANDA Bole Ram Bole Ram Song Shooting

చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. “దర్శకుడు సంపత్ నంది తాను తీసిన ప్రతి సినిమాలో ఒక రోమాంటిక్ సాంగ్ తో తనదైన మార్క్ వేశాడు. “రచ్చ” సినిమాలో  “వాన వాన”, “బెంగాల్ టైగర్” చిత్రంలో “చూపులతో దీపాల” పాటల స్థాయిలోనే “గౌతమ్ నంద”లోని “బోలే రామ్ బోలే రామ్” పాట కూడా ఉంటుంది. గోపీచంద్-హన్సికల నడుమ కమిస్ట్రీ బాగా పండింది. యూత్ ఆడియన్స్ ను ఈ పాట విశేషంగా ఆకట్టుకొనే స్థాయిలో ఉంటుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను బృంద మాస్టర్ నేతృత్వంలో ఈ పాట చిత్రీకరణ ఓ  ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న మా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అన్నారు.

గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ  కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు:  జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది.

- Advertisement -