లండన్ లో వైభవంగా “టాక్ బోనాల జాతర”

291
Bobalu celebrations in London
- Advertisement -

   తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. టాక్ మహిళా నాయకురాలు సుప్రజ పులుసు వక్తగా జరిగిన సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి స్పెషల్ రెప్రెసెంటేటివ్ అఫ్ తెలంగాణ రామచంద్రు తేజావత్ గారు,తీన్మార్ వార్తల బిత్తిరి సత్తి, ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హై కమిషన్ విజయ్ వసంతన్ ముఖ్య అతిధులుగా హాజరవడం విశేషం.

Bonalu_group

స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది.

బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన వేడుకల సభ లో ముందుగా సంస్థ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న మొట్టమొదటి బోనాల ఉత్సవాలైనప్పటికీ గతం లో ఎన్నడూ లేని విదంగా విజవంతం కావడం చాలా ఆనందంగా ఉందని, ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు చేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు . టాక్ సంస్థని, అలాగే బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాదు ఎంపీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టి. ఆర్. యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఈ తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మరియు రాబోయే రోజులో సంస్థ చేయబోయే వివిధ కార్యక్రమాల గురించి వివరించారు,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, బంగారు తెలంగాణ లో ఎన్నారైల పాత్ర గురించి అందరికి గుర్తు చేశారు.

అలాగే బోనాల వేడుకైనప్పటికీ, బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా మనందరం చేనేతకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని, హాజరైన అతుతులందరితో “ We Pledge to #SupportWeavers #WearHnadloom” అని ప్రతిజ్ఞ చేయించారు, మన రాష్త్ర మంత్రి కేటీఆర్ గారు పిలుపునిచ్చినట్టు మనంతా కూడా ఒక రోజు చేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు.

Crowd

ముఖ్య అతిధులు ముందుగా రామచంద్రు తేజావత్ గారు మాట్లాడుతూ టాక్ చేస్తున్న బోనాల పండుగలో కుటుంబ సమేతంగా పాలుపంచుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, విదేశాల్లో ఉంటూ మన సంస్కృతి సంప్రదాయాలని విశ్యవ్యాప్తం చేస్తున్న తీరు ఎంత స్ఫూర్తిగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుండి కానీ వ్యక్తిగతంగా నా నుండి కానీ ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే నన్ను సంప్రదించొచ్చని తెలిపారు.

ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి విజయ్ వసంత మాట్లాడుతూ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరుని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు.
అడ్వైసరీ ఇంచార్జి గోపాల్ మేకల సంస్థ విధి విధానాలను సభకు వివరించారు .

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి స్వాతి బుడగడం మాట్లాడుతూ తొట్టెల ఊరేగింపు యొక్క ప్రాముఖ్యత మరియు టాక్ సంస్థ తెలంగాణ సంస్కృతి ని యుకె నలుమూల ఏ విధంగా విస్తరించబోతుందో ఉన్న ప్రణాళికను సభా ముఖంగా తెలియచేసినారు.ఈ బోనాల వేడుకల్లో బాగస్వామ్యులైన ఇతర సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపిక అందజేశారు.
Chenetha
సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బిత్తిరి సత్తి తన మాటలతో పాటలతో ప్రేక్షకులను అలరింపచేశారు .టాక్ ప్రతినిధులు రామచంద్రు తేజావత్ , ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి విజయ్ వసంత మరియు తీన్మార్ వార్తల బిత్తిరి సత్తిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు.

తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సబ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంశించారు.

టాక్ సభ్యులు అశోక్ దూసరి,నవీన్ రెడ్డి ,రత్నాకర్ కడుదుల ,విక్రమ్ రెడ్డి , వెంకట్ రెడ్డి దొంతుల ,శ్రీకాంత్ జిల్లా, స్వాతి బుడగం ఆద్వర్యం లో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషం గా ఉందని కమిటీ సబ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, అడ్వైసరీ చైర్మన్ గోపాల్ మేకల, సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, శ్రీకాంత్ పెద్దిరాజు, స్వాతి బుడగం , సంజయ్ సేరు, సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, శశిధర్ రెడ్డి, స్నేహ రెడ్డి, శ్రీనివాస్ మేకల, సుమ దేవి, సుప్రజ, అపర్ణ , సురేష్ బుడగం, వెంకట్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ప్రవళిక, కిరీటి, జాహ్నవి, వేణు రెడ్డి నక్కిరెడ్డి, ప్రియాంక, శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవి కిరణ్, గణేష్, హరి, హరిదీప్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, మట్టా రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి ప్రదీప్, రవి రతినేని, నరేందర్, నవీన్ భువనగిరి, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -