టీమిండియా సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు.కొంతకాలంగా టీమిండియాలో చోటుకోసం ప్రయత్నిస్తున్న గంభీర్ తనకు ఎలాంటి ఆసక్తి లేనప్పుడు క్రికెట్‌కు వీడ్కోలు పులుకుతానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గంభీర్ అడుగుపెట్టి 15 సంవత్సరాలైంది. ప్రస్తుతం విజయ్ హజారే టోర్నిలో గౌతీ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియాలో తిరిగి స్ధానం సంపాదిస్థానని తెలిపాడు.
గెలవడం,డ్రెస్సిం్ రూమ్‌కు రావడం నాకేంతో సంతోషమని నాలో అభిరుచి ఉన్నంత వరకు పరుగులు చేస్తున్న వరకు గెలుపుకోసం పోరాడుతూనే ఉంటానని తెలిపాడు. ఎప్పుడైతే క్రికెట్‌తో భావోద్వేగాలు ముడిపడవో అప్పుడు నాకు రిటైర్మెంట్ సమయం ఆసన్నమైనట్టేనని తెలిపాడు.
1999లో ఢిల్లీ తరపున రంజీల్లో ఆరంగేట్రం చేసిన గౌతీ…టీమిండియా రెండు ప్రపంచకప్‌లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర ఒత్తిడిలో 122 బంతుల్లో 97 పరుగులు సాధించాడు. 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అందుకున్నాడు.