- Advertisement -
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. గంభీర్ ఫౌండేషన్ ద్వారా కరోనా రోగులకు ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను పంచగా దీనిపై దాఖలైన పిటిషన్‌పై డ్రగ్ కంట్రోలర్ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గంభీర్ ఫౌండేషన్ అక్రమంగా ఫాబీ ఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వచేసిందని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది డ్రగ్ కంట్రోల్.
డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ కింద గంభీర్ ఫౌండేషన్ నేరం చేశారని… ఇదే యాక్ట్ ప్రకారం ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కూడా దోషిగా తేలినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో మళ్లీ జూలై 29న విచారణ జరగనుంది.
తాను పంపిణీ చేసిన మందులు అత్యవసరమైనవని, వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు చేసినా.. తాను మాత్రం ప్రాణాలు రక్షించేందుకు ప్రజాసేవ చేస్తూనే ఉంటానని గంభీర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -