కోహ్లీకి బీజేపీ ఎంపీ కీలక సలహా!

246
gambir

ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. తొలిమ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నై-ముంబై మధ్య జరగనుంది. ఇక ఈ సారి అన్నిజట్లు ఐపీఎల్ కప్‌పై కన్నేయగా ముఖ్యంగా ఈ సీజన్‌లో టోర్నిని గెలిచి తొలి కప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది ఆర్సీబీ.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌కు కీలక సలహా ఇచ్చారు టీమిండియా మాజీ ఆటగాడు,కేకేఆర్ మాజీ కెప్టెన్,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. కెప్టెన్ కోహ్లీ పరుగులు సాధించడం కంటే మ్యాచ్‌ల్లో టీమ్‌ని గెలిపించడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించాడు.

గత సీజన్లలో పోలిస్తే బెంగళూరు టీమ్ ఇప్పుడు మంచి సమతూకంతో కనిపిస్తోంది.గతంలో ఆర్సీబీ ఎక్కువగా బ్యాటింగ్‌నే నమ్ముకునేది. బౌలింగ్‌ గురించి అస్సలు పట్లించుకునేది కాదు. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం ఆ టీమ్ మేనేజ్‌మెంట్ మంచి బౌలర్లు, ఆల్‌రౌండర్లని తీసుకుందన్నారు. ఒక బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్‌గా కోహ్లీకి టైటిల్‌ ఇప్పుడు అత్యవసరం అన్నాడు.