- Advertisement -
గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే అవి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.41 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,762కు తగ్గింది. తగ్గిన ధరలు నేటి నుండి అమల్లోకి రాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
ఎల్పీజీ సిలిండర్ ధరలతో పాటు జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల ధరలను తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-productsలో చూడవచ్చు.
Also Read:హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు..అప్‌డేట్
- Advertisement -