- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ కాగా ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు.
ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. చనిపోయిన వారిలో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు.
ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమకు మూడు కిలోమీటర్ల పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురం, పద్మాపురం, బీసీ కాలనీ, కంపరపాలెం గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గ్రామాల పరిధిలోని సుమారు 2 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.
- Advertisement -