ఇళ్లలో పనిమనుషులకు అనమతి నిరాకరణ..

245
hyderabad
- Advertisement -

ఇళ్లలో పని మనుషులకు, డెలివరీ బాయ్ లకు అనుమతి లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్ మెంట్ ఓనర్లు, గేటెడ్ కమ్యూనిటీలు అడిగిన సమాచారం మేరకు అధికారులు స్పష్టత ఇచ్చారు.

మే 29 వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో సామాన్య జన సంచారంపై యధావిధిగా ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని ఇళ్లలో పని మనుషులు, డెలివరీ బాయ్స్ అనుమతికి నిరాకరించింది ప్రభుత్వం.

బయటకు వచ్చి ఇంటింటికీ సంచరించడం ద్వారా వాళ్లతో పాటు ఇంటి యజమానులు కూడా కరోనా వైరస్ బారినపడే అవకాశాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరీ జిల్లాలు రెడ్ జోన్లలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తేసే అంత వరకు లేదా ఆ ప్రాంతాలు ఆరెంజ్, లేదా గ్రీన్ జోన్లలోకి మారేంత వరకు పని మనుషులకు అనుమతి లేదని తెలిపారు అధికారులు.

ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే జీహెచ్ఎంసీలో ఐతే జోనల్ అధికారి, ఇతర ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్ల నుంచి లిఖితపూర్వక నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ను విధిగా పొందాలన్నారు.

- Advertisement -