పంట పొలాల్లో గంజాయి..రైతు బంధు కట్!

84
ganja
- Advertisement -

రైతులకు ఆర్ధికంగా వెన్నుదన్ను కల్పించేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకం రైతు బంధు. పెట్టుబడి సాయంగా ఎకరానికి పదివేల రూపాయలను అందిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లు దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బును జమచేశారు.

అయితే రైతులకు ఇస్తున్న రైతు బంధు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారాయణ్‌ఖేడ్‌, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, వరంగల్‌, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌కి చెందిన రైతులు గంజాయి పండిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. జూన్‌లో వస్తున్న రైతు బంధును రైతులకు ఇవ్వొద్దని ఎక్సైజ్‌శాఖ లేఖలో వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి రైతు బంధు పథకాన్ని నిలిపివేయనున్నారు.

- Advertisement -