ఖమ్మం జిల్లాలో రైతుబంధు లోపాలను సరిదిద్దండి

444
puvvada
- Advertisement -

ఖమ్మం జిల్లాలో రైతుబంధు లోపాలను సరిదిద్దాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మినిస్టర్స్ క్వార్టర్స్ లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. పొలాల హెచ్చుతగ్గుల నేపథ్యంలో గతంలో రైతుబంధు చెక్కులు వెనక్కి తీసుకున్నారని.. వాటిని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని చెప్పారు. ఖమ్మం జిల్లాలో రుణాలు షెడ్యూల్ చేసిన రుణమాఫీ లేని 20 వేల మంది రైతులకు దాదాపు రూ.90 కోట్లు  ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్ధికశాఖ ద్వారా ఆ డబ్బులు రైతుల ఖాతాలలో పడేవిధంగా చూడాలని విజ్నప్తి చేశారు. వేంసూరు, సత్తుపల్లి, లచ్చన్నగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంఘాల పరిధిలో దాదాపు 6వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు.

- Advertisement -