వినాయకుడి లడ్డూ @ రూ.కోటి 25 లక్షలు

29
- Advertisement -

వినాయకుడి లడ్డూ వేలంలో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. లడ్డూ వేలం అనగానే గ్రేటర్ ప్రజలకు గుర్తుకొచ్చేది బాలాపూర్ లడ్డే. ప్రతీ ఏడాది అంతకంతకు పెరుగుతూ రూ.25 లక్షలకు చేరువైంది. ఈ వేలాన్ని చూసే ప్రజలు ఇంత డబ్బా అని ముక్కున వేలేసుకుంటారు. కానీ దీనిని మించి ఈసారి వేలంలో లడ్డూ వేలం పాట జరిగింది.

బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్‌ విల్లాలో ఏకంగా రూ.కోటి 25 లక్షలు పలికింది వినాయకుడి లడ్డూ. నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి లడ్డును రూ.కోటి 25 లక్షలకు దక్కించుకున్నారు. ఇక మాదాపూర్‌లోని మైహోమ్‌ భుజాలోని ( గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్‌ అనే వ్యక్తి దక్కించుకున్నారు.

ఇక బాలాపూర్ లడ్డూను ఈసారి రూ.27 లక్షలకు దాసరి దయానందరెడ్డి దక్కించుకున్నారు. లడ్డూ కోసం 36 వేల మంది పోటీపడగా క్రమక్రమంగా పెరుగుతూ రూ.27 లక్షలకు దక్కించుకున్నారు దయానంద రెడ్డి. గతేడాది వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60 లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే.

Also Read:నేటి రెండు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -