గేమ్ ఛేంజర్..న్యూ ఇయర్ ట్రీట్

1
- Advertisement -

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. న్యూ ఇయ‌ర్ కానుక‌గా జ‌న‌వ‌రి 02 సాయంత్రం 5.04 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా న్యూ ఇయ‌ర్ విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.

Also Read:న్యూఇయర్ ..కోట్ల మద్యం తాగేశారు!

- Advertisement -