ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా గడికోట శ్రీకాంత్ రెడ్డి

620
gadikota srikanth reddy
- Advertisement -

ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా వైసీపీ సీనియర్‌ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమించారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌. విప్‌లుగా పారధసారధి, చెవిరెడ్డి భాసర్‌రెడ్డి ,దాడిశెట్టి రాజా,బూడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాస్‌లను నియమించారు. ఇక ఏపీ స్పీకర్‌గా మాజీమంత్రి తమ్మినేని సీతారాం పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు వైఎస్ జగన్‌. వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్న జగన్‌ మొదటి బ్లాక్‌లో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కుర్చీపై ఆసీనులయ్యారు. అనంతరం సచివాలయంలో ఆశావర్కర్లకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు, కొత్తగా ఎంపికైన మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు సీఎం జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం జగన్‌ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది.

- Advertisement -