రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్‌ రన్‌

32
- Advertisement -

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్‌ రన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌లో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఫ్రీడమ్‌ రన్‌ను జెడ్పీ చైర్మన్‌ రోజా రాధాకృష్ణ శర్మి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేతా, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఫ్రీడమ్‌ రన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, పౌరులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు.

మహబూబ్‌నగర్‌ జెడ్పీ మైదానంలో ఫ్రీడమ్‌ రన్‌ను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ వీధుల గుండా జరిగిన రన్‌లో భారీ సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, అధికారులు పాల్గొన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కే రన్‌ను కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. ఏరియా దవాఖాన నుంచి ప్రేమ్‌నగర్‌, గట్టమ్మ దేవాలయం మీదుగా హరిత హోటల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఫ్రీడమ్‌ రన్‌లో స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌ను కలెక్టర్‌ అనురాజ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే ప్రారంభించారు.

- Advertisement -