టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు

521
chandrababu
- Advertisement -

తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు ఆ ఆపార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానంతో చంద్రబాబును ఎన్నుకున్నారు. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేవలం 23అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచింది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుతుండగా.. ఎట్టకేలకు ఆ ప్రచారాలకు తెర దించారు. టీడీఎల్పీ నేతగా ఎన్నికవడం చంద్రబాబుకు వరుసగా ఇది ఆరోసారి. టీడీఎల్పీ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు, భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చించారు

- Advertisement -