ఫేస్‌బుక్,ట్విట్టర్ లో గ్యాస్‌ సిలండర్లు బుక్‌ చేసుకోండి..!

232
- Advertisement -

సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగం విస్తృతం కావడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఫోన్, ఎస్సెమ్మెస్ ద్వారా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఇకపై వీటికి అదనంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ కూడా బుక్‌ చేసుకునే వెసులుబాటుకు ఐఓసీఎల్ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీగా ఐఓసీఎల్ అవతరించింది.

 Forget phone and SMS, now book LPG cylinders through Facebook, Twitter

ఫేస్‌బుక్ ద్వారా ఇలా బుక్ చేసుకోవచ్చు..
* తొలుత మన ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసుకోవాలి
* తర్వాత ఐఓసీఎల్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ @indianoilcorplimitedలోకి వెళ్లాలి
* అందులో ఉన్న ‘బుక్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకోవాలి

ట్విట్టర్ ద్వారా ఇండేన్ రీఫిల్ బుకింగ్ ఇలా..
* @indanerefill‌లోకి వెళ్లి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
* తొలిసారి మాత్రం LPGID ట్వీట్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా గ్యాస్‌ సిలండర్లు బుక్‌ చేసుకోండి

- Advertisement -