ఫోకస్ రాజకీయాలపైనే.. అభివృద్దిపై కాదు!

19
- Advertisement -

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ రాష్ట్రనికి పెట్టుబడులు తీసుకురావడంలోనూ, పరిశ్రమలు తీసుకురావడంలోనూ తనదైన ముద్ర వేస్తూ ఇతర రాష్ట్రాల మంత్రులకు మార్గదర్శికంగా నిలుస్తున్నారు. ఇక కే‌టి‌ఆర్ వాక్ ధాటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రజలకు అవసరమయ్యే వాటి గురించి బలంగా తన గళాన్ని వినిపిస్తూ.. అనవసర విషయాలను ఏ మాత్రం పట్టించుకోరాయన. ఇక ఆయన చేసే వ్యాఖ్యలు ప్రజల్లో ఏ స్థాయిలో స్పూర్తి నింపుతాయో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ఇక తాజాగా ఆయన ఎన్‌హెచ్‌ఆర్‌డి డి కోడ్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో పాల్గొన్న కే‌టి‌ఆర్ నేటితరం రాజకీయ నాయకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

” మన దురదృష్టం ఏమిటంటే.. మన దేశ రాజకీయ నాయకుల దృష్టంతా ఎప్పుడు రాజకీయాలపైనే ఉంటుంది. ఏకనామిక్స్ పైన గాని, అభివృద్ది పైన గాని అసలు దృష్టి పెట్టరు. నాయకుల దృష్టి అంతా వచ్చే ఎన్నికలపైనే ఉంటుంది. భవిష్యత్ తారలు ఎలా ఉండాలో అనే దానిపై అసలు ఆలోచించరు. ఇది ఏ ఒక్కరికో ఆపాదించడం కాదు. అందరూ పొలిటీషియన్స్ అంతా ఇలాగే ఉన్నారు.. ఇందుకు నేను కూడా మినహాయింపు కాదు ” అంటూ కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే నంటూ కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. నిజానికి కే‌సి‌ఆర్ చెప్పింది అక్షర సత్యం అని ప్రతిఒక్కరు ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు స్వలాభం కోసం, వారి రాజకీయ భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నారు తప్పా.. రాబోయే రేపటి తరం గురించి ఆలోచించడంలేదు. దేశాన్ని పాలించే పొలిటీషియన్ విజన్ తో పని చేసినప్పుడే అభివృద్దికి అడుగులు పడతాయి. ప్రస్తుతం కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

ఇవి కూడా చదవండి…

ఈటెలకు 24 గంటల కరెంట్ ” షాక్ “!

దేశాభివృద్ధి కోసం బడ్జెట్‌ తేలేదు

తండ్రి తర్వాత తండ్రి కేసీఆర్..

- Advertisement -