ఈటెలకు 24 గంటల కరెంట్ ” షాక్ “!

40
- Advertisement -

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ 24 కరెంట్ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కే‌సి‌ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 24 గంటల కరెంట్ తో వ్యవసాయ రంగంతో పాటు అన్నీ రంగాలకు కూడా నిరంతరాయంగా విధ్యుత్ సరఫరా జరుగుతోంది. వ్యవసాయానికి ఉచితంగా అన్నీ రంగాలకు ఆమోద యోగ్యంగా ఒక తెలంగాణలోనే 24 నిరంతరాయ కరెంట్ ను సుసాధ్యం చేశారు సి‌ఎం కే‌సి‌ఆర్. రాష్ట్రంలో అమలౌతున్న 24 గంటల కరెంట్ ను చూసి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముక్కున వేలేసుకునే పరీస్థితి. గతంలో ఉమ్మడి రాష్ట్రంగ ఉన్నప్పుడూ ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు ఉండేవి.

కరెంట్ ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితి కానీ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత విధ్యుత్ రంగంలో సి‌ఎం కే‌సి‌ఆర్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అదనంగా విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను నిర్మించడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రాలను ఏర్పాటు చేసి విధ్యుత్ రంగానికి పునర్జీవం పోశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2018 నుంచి రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ను ఇందిస్తూ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శికంగా నిలుస్తోంది కే‌సి‌ఆర్ సర్కార్. కాగా కే‌సి‌ఆర్ అమలు చేస్తోన్న 24 గంటల ఉచిత కరెంట్ పై దేశ వ్యాప్తంగా కూడా ప్రశంశలు వెల్లువెత్తుతునే ఉన్నాయి.

దీంతో తెలంగాణ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కే‌సి‌ఆర్ పాలనకు విధేయత చూపుతూనే ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం 24 గంటల కరెంట్ విషయంలో సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అసలు అమలు కావట్లేదని, ఒకవేళ అమలౌతున్నట్లు నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తానంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈటెల చేసిన వ్యాఖ్యలపై సెటైరికల్ కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అమలౌతున్న విషయం అందరికీ తెలుసు.. ముక్కు నేలకు రాయడానికి ఈటెల సిద్దంగా ఉన్నారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం కే‌సి‌ఆర్ పాలన బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది జగమెరిగిన వాస్తవం.

ఇవి కూడా చదవండి…

దేశాభివృద్ధి కోసం బడ్జెట్‌ తేలేదు

తండ్రి తర్వాత తండ్రి కేసీఆర్..

పకోడీ గాళ్లకు.. జగన్ భయపడడు!

- Advertisement -