ఆకాశంలోకి మరో కొత్త విహంగం ఎగురబోతుందని తెలిపింది ఆకాశ్ ఎయిర్ సంస్థ. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుండి గురువారం ఆకాశ ఎయిర్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏవోసీ)ను పొందింది. ఎయిర్‌లైన్ కార్యకలాపాలను ప్రారంభించుకొవచ్చని తెలపింది. ఆకాశ ఎయిర్ సంస్థను ఏస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ప్రమోట్ చేసిన స్టార్టప్ సంస్థ. ఇది జూలై చివరిలో సేవలను ప్రారంభించనుందని తెలిపారు.
ఆకాశ ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి, అమ్మకానికి మా విమానాలను తెరవడానికి మరియు వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి దారితీసిందని ప్రకటించుకొన్నది.
గత సంవత్సరం డిసెంబర్‌లో, కంపెనీ తన బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది. కాగా గత సోమవారం సంస్థ తన సిబ్బందికి యూనిఫాం ఫస్ట్ లుక్ అవిష్కరించింది. ఆకాశ బిజీ ఫ్లైట్ షెడ్యూల్‌కు వారి సౌకర్యార్థం, సాధ్యమైనంత ఉత్తమమైన స్ట్రెచ్‌ను అందించామని తెలిపారు. కస్టమ్ ట్రౌజర్‌లు మరియు జాకెట్‌లను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఇదేనని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్యాబ్రిక్ మరియు సౌకర్యవంతమైన స్నీకర్‌లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. విమాన సిబ్బందికి సరిపడా ఎర్గోనామిక్స్, సౌందర్యం మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని యూనిఫాం ఆవిష్కరించామని తెలిపారు. ఇది ఆకాశం యొక్క మూలకం నుండి ప్రేరణ పొందామని తెలిపారు. ఆకాశ ఎయిర్ సంస్థ జూన్21న భారతదేశంలో తన మొదటి బోయింగ్ 737మాక్స్ విమానాన్ని డెలివరీ తీసుకున్నామని తెలిపారు. ఆకాశ ఎయిర్ బోయింగ్ నుండి 72 ‘737’ మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేశామని తెలిపింది.