బ్రిటన్‌కు కొత్త ప్రధాని : రిషి సునాక్‌ !

93
rishisunak
- Advertisement -

బ్రిటన్‌ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతొంది. తాజాగా ప్రధాని బోరిస్‌ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు దాంతో రిషి సునాక్‌ కొత్త ప్రధానిగా తెరపైకి వచ్చారు. 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. భారత సంతతి వ్యక్తి అయిన రిషి… పూర్వీకులది పంజాబ్‌. వీరి పూర్వీకులు మొదట ఆఫ్రికా నుంచి తర్వాత యూకేకు వలస వెళ్లారు. స్టోన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేశాక కొంత కాలం ప్రవైట్‌ సంస్థల్లో పనిచేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం, ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

కన్జర్వేటివ్‌ పార్టీలో కొంతకాలం ఇంటర్న్‌షిప్‌ చేశాక… 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. బోరిస్‌ అనుచరిడిగా మంచి గుర్తింపు పొందిన రిషి… అయనకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నారు. బోరిస్‌ కెబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూనే, కరోనా కాలంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తన వ్యక్తిత్వం దూకుడు శైలితో రైజింగ్‌ స్టార్ మినిస్టర్‌ గా కుడా పేరుపొందారు. బోరిస్‌ కరోనా కాలంలో అధికారక నివాసంలో చేసుకున్న పార్టీ వలన, ఫించర్‌ను చీఫ్‌ విప్‌గా నియమించడంతో బోరిస్‌పై తీవ్ర విమర్శలు మరింత పెరిగాయి దీంతో బ్రిటన్‌ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. తాజాగా బోరిస్‌ కెబినెట్‌లోని మంత్రులందరూ ఒకొక్కరుగా రాజీనామా చేస్తున్నారు.

బోరిస్‌ పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ రిషి ఇటీవల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత వరుసగా మంత్రుల రాజీనామాల పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలోనే రిషి సునాక్‌ తో పాటు పలువురు పేర్లు ప్రధాని రేసుల్లో ఉన్నాయి. కాని రిషి సునాక్‌ పేరు పాపులారిటీ కావడం, కరోనా కాలంలో తను తీసుకొన్న నిర్ణయాల వల్ల బ్రిటన్‌ ప్రజల్లో మంచి పేరు సంపాందించుకొన్నారు.

- Advertisement -