భల్లాల దేవ ‘ఘాజీ’ ఫస్ట్ లుక్

110
First look of The Ghazi Attack is out

బాహుబలి 2 తర్వాత రానా దగ్గుబాటి మరో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రానా… బాహుబలి సినిమాలో లాగా కత్తులు, బాణాలతో కాకుండా దేశాల మధ్య యుద్ధాలు జరిగితే ఆర్మీ , నేవీ కలిసి ఎలా అయితే యుద్ధాలు చేస్తాయో ప్రేక్షకులకు చూపించడానికి ముందుకువస్తున్నాడు.

ఘాజీ అనే ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్నాడు రానా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీవీపీ సినిమా బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో రానా లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ అయ్యింది. ఇటీవల టైటిల్ లోగోను విడుదల చేసిన చిత్రయూనిట్, తాజాగా నావెల్ ఆఫీసన్ యూనిఫాంలో ఉన్న రానా ఫోటోను విడుదల చేసింది.

First look of The Ghazi Attack is out

‘ఘాజీ’ అనే పేరుగల జలాంతర్గామి 1971 ఇండియా- పాకిస్థాన్ యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించింది అనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఏ భారతీయ సినిమా రాలేదు. దీంతో ఈ సినిమా పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, కేకే మెనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17, 2017లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.