విజయ్‌ సినిమాలపై పడ్డ అగ్ర హీరోలు..!

183
Mahesh film will be 2.0 version of Vijay’s Thuppakki

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన సినిమాలపై టాలీవుడ్ అగ్రహీరోలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన విజయ్ సినిమాలు కత్తి,తుపాకీ సినిమాలు తెలుగులో రిమేక్‌గా తెరకెక్కనున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరు…చాలా కాలం గ్యాప్‌ తర్వాత కత్తి..రిమేక్ ఖైది నెంబర్ 150గా వస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మూడు గంటల్లోనే 10 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

ఇక మరో సూపర్ స్టార్ మహేష్ బాబు… సైతం విజయ్ తుపాకీ సినిమాకు గురిపెట్టాడు. మురగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో  మహేష్ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

ఇక మహేష్ ప్రస్టెజియస్ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ పై రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. మొదటగా ఎనిమీ.. ఆ తర్వాత వాస్కోడిగామా.. రీసెంట్ గా అభిమన్యుడు,ఏజెంట్ శివ అనే టైటిల్స్ సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు యూనిట్ ఖండిస్తూనే ఉంది కానీ.. ఇప్పుడో కొత్త టైటిల్ సర్క్యులేట్ అవుతోంది. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు సంభవామీ అనే టైటిల్ను నిర్ణయించారట. 2017లో సమ్మర్ కానుకగా మహేష్ రాబోతున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. గతంలో విజయ్ హీరోగా నటించిన తుపాకి సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాట ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.