స్పైస్ జెట్ కార్గోలో హైదరాబాద్‌కు కోవిడ్‌ వాక్సిన్..

231
covid vacssine
- Advertisement -

ఈ నెల 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. కేంద్రం వ్యాక్సిన్‌ రవాణాను ఈరోజు నుండి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్‌ టీకా తొలి విడత సరఫరాను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించింది. తొలి విడతలో పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు వ్యాక్సిన్ సరఫరా చేయనుంది.

ఇందులో భాగంగా ఎయిరిండియా స్పైస్ జెట్ కార్గో లో sg7466లో వాక్సిన్ హైదరాబాద్ కు చేరుకోనున్నది. ఈ రోజు ఉదయం 11.30 కి వాక్సిన్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుతుంది. ఎయిరిండియా, గోఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌కు చెందిన విమానాలతో ఆయా ప్రాంతాలకు వ్యాక్సిన్ రవాణా చేయనుంది. వ్యాక్సిన్ రవాణాలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి కొవిషీల్డ్‌ టీకా చేరుకున్నది. స్పైస్ జెట్ విమానంలో పూణే నుండి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి.

- Advertisement -