వాట్సాప్‌లోనే కరోనా టీకా స్లాట్ బుకింగ్..

160
Covid-19 vaccination
- Advertisement -

కరోనా టీకా స్లాట్ బుకింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై వాట్సాప్ లోనూ కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోదలచినవారు కొవిన్ పోర్టల్ లో గానీ, నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గానీ తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందేవారు. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం కల్పించింది.

వాట్సాప్ లోనూ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఓ ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నవారు 90131 51515 నెంబరుకు “బుక్ స్లాట్” అని సందేశం పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరి వాట్సాప్‌ ద్వారా టీకా స్లాట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

– ఇందుకోసం ముందు MyGovIndia Corona Helpdesk నంబరు 91-9013151515ను మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేసుకోవాలి.
– ఆ తర్వాత వాట్సాప్‌లో ఈ నంబరుకు ‘Book Slot’ అని మెసేజ్‌ పంపాలి.
– అప్పుడు మీ ఫోన్‌ నంబరుకు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి నంబరు వెరిఫై చేసుకోవాలి.
– ఆ తర్వాత తేది, లొకేషన్‌, పిన్‌కోడ్‌, వ్యాక్సిన్‌ టైప్‌ తదితర వివరాలను నింపాలి.
– అన్నీ పూర్తయ్యాక Confirm చేస్తే మీకు స్లాట్‌ బుక్‌ అవుతుంది.

- Advertisement -