ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌..

221
cm kcr
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల హామీ నెరవేర్చారు సీఎం కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుంచే ఉచిత తాగునీరు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ పథకం పేరు ఉచిత మంచినీటి సరఫరా. దీన్ని ఈరోజు నుంచి అమలు చేసేందుకు అధికారులు నాలుగు రోజుల నుంచే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఈ పథకాన్ని ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. జూబ్లీహిల్స్‌లోని రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు.

ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వాల్సి వచ్చినా… నిజానికి ఈ పథకం అమలు అనేది తెలంగాణ ప్రభుత్వానికి అతి పెద్ద భారమే. తెలంగాణ మొత్తంలో నీటి వాడకం ఎక్కువగా ఉండేది జీహెచ్‌ఎంసీ పరిధిలోనే. అలాంటి చోట ఉచితంగా మంచినీరును అందించడం అంటే మాటలు కాదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఉచితంగా నీరు అందించడం కష్టమైన పనే. 20వేల లీటర్ల లోపు నీరు ఉచితంగా సరఫరా చేస్తామనీ, డిసెంబర్ నెల నుంచి నెల వారీ బిల్లులు ఉండవనీ, గ్రేటర్ పరిధిలో ఉన్న నీటి కనెక్షన్లలో 90 శాతం కనెక్షన్లు ఉచిత నీటి పథకం పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. మొత్తానికి ఇచ్చిన హామీ నెరవేర్చుతుంటే హైదరాబాద్ ప్రజలు ఆనందంతో సంక్రాంతి పండుగ ముందే జరుపుకుంటున్నారు.

- Advertisement -