Kim Cotton:ఫస్ట్‌ ఫీమేల్‌ అంపైర్‌ కిమ్‌ కాటన్..!

69
- Advertisement -

న్యూజిలాండ్‌- శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలిసారి మహిళా అంపైర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్ నిలిచింది. డునెడిన్‌లో జరుగుతున్న రెండవ టీ20 మ్యాచ్‌ ద్వారా ఈ ఘనత సాధించింది. మహిళల క్రికెట్‌లో అనుభవం కలిగిన కాటన్ 2018 నుండి ఇప్పటివరకు 54మహిళల టీ20లు, మరియు 24 మహిళల ఓడీఐలలో టీవీ అంపైర్‌గాను, ఆన్‌-ఫీల్డ్‌ గా వ్యవహరించారు. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి మూడు గేమ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

అంతేకాదు అసోసియేట్ దేశాలకు చెందిన ఒమన్ మరియు నమీబియా ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్‌పోలోసాక్ అంపైర్‌గా పనిచేశారు. ఈమె 2022లో సిడ్నీలో జరిగిన భారత్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఫోర్త్ అంపైర్‌గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి…

IPL2023 : బట్లర్ బాదుడు.. ఆపతరమా?

2011వరల్డ్‌కప్‌..చివరి సిక్స్ తాకిన బెంచ్‌కు ధోనీ పేరు.!

కీలక సూత్రధారి బండి సంజయ్‌: సీపీ రంగనాథ్‌

- Advertisement -