- Advertisement -
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. పూరీ సొంత బ్యానర్లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ నటిస్తున్న ఈమూవీని పూరీ అసిస్టెంట్ అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సాంగ్ చిత్రికరిస్తుండగా సెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదవశాత్తు ఈప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
అక్కడున్న సిబ్బంది వెంటనే మంటలు ఆర్పడంతో ఎటువంటి ప్రమాదం జరుగలేదు. కాకపోతే సెట్ లో ఉన్న కొన్ని వస్తువులు కాలిపోయినట్లు సమాచారం. ఈఘటన వల్ల భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఈఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూరీ జగన్నాథ్ ఈసినిమాకు కథను అందించారు. ఇప్పటికే ఈమూవీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
- Advertisement -