విజయ్‌తో మూవీ చేయాలనుంది: రకుల్

524
rakul vijay
- Advertisement -

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈమూవీ విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది.

ఇటీవలె 29వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న రకుల్‌ తన మనసులోని మాటను బయటపెట్టింది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు అగ్రహీరోలు మహేష్,రామ్ చరణ్,ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని కానీ తన మనసులో ఏదో వెలితి ఉందని చెప్పుకొచ్చింది. విజయ్‌ దేవరకొండతో నటించి ఆ వెలితిని తీర్చుకోవాలని ఉందని తెలిపింది.

విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని…ముఖ్యంగా అర్జున్‌ రెడ్డిలో విజయ్‌ నటనకు ఫిదా అయ్యానని తెలిపింది. ఈ సినిమా చూసినప్పటి నుంచి విజయ్‌తో నటించాలనే కోరిక మరింత బలపడిందని చెప్పింది రకుల్‌. మరి ఈ భామ కోరిక నెరవేరుతుందా…? లేదా వేచిచూడాలి.

- Advertisement -